అసెంబ్లీ సెషన్స్ బహిష్కరణకు వైసీపీ నిర్ణయం | Oneindia Telugu

2017-10-26 284

Ysrcp decided to boycott Ap Assembly session on Thursday.Ysrcp meeting held at Hyderabad on Thursday. Ysrclp made allegations on Tdp.
వచ్చే నెల 8వ, తేది నుండి ప్రారంభం కానున్న ఏపీ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ శాసనసభపక్షం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు గురువారం నాడు జరిగిన శాసనసభపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వైసీపీ వర్గాలు ప్రకటించాయి. వచ్చే నెల 6వ, తేది నుండి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ పాదయాత్ర ప్రారంభానికి రెండు రోజుల ముందే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ స్పీకర్‌కు గతంలోనే ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయమై విచారణ చేస్తున్నట్టు గతంలోనే స్పీకర్ ప్రకటించారు.